ETV Bharat / state

ఈటీవీ భారత్​ కథనానికి స్పందించిన భారత్​ బయోటెక్​ జాయింట్​ డైరెక్టర్​

ఒంట్లో ఉన్న సత్తువకు... ఆత్మగౌరవాన్ని జతచేసి తొమ్మిదిపదుల వయసులోను సొంతంగా వ్యాపారం చేసుకుంటూ సమాజంలో గౌరవంగా బతుకుతున్నాడు వరంగల్​ పట్టణ జిల్లా దేవన్నపేటకు చెందిన ఉప్పలయ్య. ఆయన కష్టాన్ని చూసి ఈటీవీ భారత్​ ఓ కథనాన్ని ప్రచురించగా... భారత్​ బయోటెక్​ జాయింట్​ డైరెక్టర్​ సుచిత్రా ఎల్లా స్పందించారు. ఆయనకు ఓ సైకిల్​ను బహుమతిగా పంపించారు.

bharat biotech joint director respond to etv bharat news
ఈటీవీ భారత్​ కథనానికి స్పందించిన భారత్​ బయోటెక్​ జాయింట్​ డైరెక్టర్​
author img

By

Published : Aug 23, 2020, 3:12 PM IST

Updated : Aug 23, 2020, 3:30 PM IST

ఈటీవీ భారత్​ కథనానికి స్పందించిన భారత్​ బయోటెక్​ జాయింట్​ డైరెక్టర్​

ఓవైపు పక్షవాతం వచ్చిన భార్యకు సపర్యలు చేస్తూ కంటికిరెప్పలా చూసుకుంటూనే... ఇంకోవైపు రోజూ ఓ పాత సైకిల్​పై 40 కిలోమీటర్లు తిరుగుతూ చేనేత వస్త్రాలు అమ్మడం ద్వారా బతుకు పోరాటం సాగిస్తున్నాడు ఓ 90 ఏళ్ల వృద్ధుడు. మలిదశలోనూ అయినవాళ్లపై ఆధారపడకూడదని కష్టపడుతున్నాడు. వరంగల్ పట్టణ జిల్లా హసన్​పర్తి మండలం దేవన్నపేట గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధుడు...ఉప్పలయ్యపై ఈటీవీ భారత్​, ఈనాడులో వచ్చిన కథనానికి స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. 'తొమ్మిది పదుల వయసులోనూ బతుకు పోరాటం' అనే శీర్షికతో ఈటీవీ భారత్​లో ప్రచురితమైన కథనానికి భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా స్పందించారు.

ఓ సైకిల్​ను హైదరాబాద్​లో కొనుగోలు చేసి కానుకగా పంపించగా... ఆదివారం ఉదయం వరంగల్​కు విచ్చేసిన భారత్ బయోటెక్ ప్రతినిధులు ఉప్పలయ్య నివాసానికి వెళ్లి సైకిల్​ను స్వయంగా అందించారు. తన కష్టాన్ని చూసి సైకిల్ ఇచ్చినందుకు ఉప్పలయ్య దాతకు...ప్రసారం చేసిన ఈటీవీ భారత్​కు రెండు చేతులూ జోడించి ధన్యవాదాలు తెలిపారు.

ఇవీ చూడండి: తొమ్మిది పదుల వయసులోనూ బతుకు పోరాటం

Last Updated : Aug 23, 2020, 3:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.