వరంగల్ అర్బన్ జిల్లా ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. లాక్డౌన్ కారణంగా ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకులు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు.
అనంతరం అమ్మవారికి పల్లకి సేవతో పాటు శేష వాహనంపై ఊరేగించారు. అలాగే త్వరలోనే కరోనా మహమ్మారి అంతం కావాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆలయ ప్రధానార్చకులు ఆగమశాస్త్ర సామ్రాట్ శేషు తెలిపారు.
ఇదీ చదవండి: 18 రోజుల్లో 4 శాతానికి పైగా దిగువకు కరోనా కేసులు