బతుకమ్మ వేడుకలకు ఓరుగల్లు వనితలు వైభవంగా జరుపుకుంటున్నారు. ఇళ్లు, అపార్ట్ మెంట్లలో మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చడంలో పోటీ పడుతున్నారు. తంగేడు పూలు దొరక్కపోయినా నగర శివార్లలోని గ్రామాల నుంచి తెచ్చుకుని బతుకమ్మలను తయారు చేస్తున్నారు. గునుగు, బంతి, చామంతి, గుమ్మడి, దోస, కట్ల, బీర పూలను తెచ్చి పాటలు పాడుకుంటూ.... బతుకమ్మలను అలంకరిస్తున్నారు.
ఇదీ చూడండి: ముంబయిలో అంబరాన్నంటిన బతుకమ్మ వేడుకలు