వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ముస్లిం సోదరులు బక్రీద్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. హన్మకొండలోని బొక్కలగడ్డ ఈద్గా వద్దకు ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు ఖురాన్‌ను చదివి వినిపించారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరికి బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఇవీ చూడండి;నాగార్జునసాగర్ 20 క్రస్ట్ గేట్లు తెరిచిన అధికారులు