తెలంగాణ ఇంద్రకీలాద్రి ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయం ఉత్సవాలకు ముస్తాబైంది. ఉత్సవాలలో మొదటి రోజు అమ్మవారికి 1008 కలశాలతో సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి మొదలైన ఉత్సవాలు ఆషాఢ శుద్ధ పౌర్ణమి తో ముగుస్తాయి. 13 రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలలో అమ్మవారు రోజుకో అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. చివరి రోజు అమ్మవారు శాకంబరీ రూపంలో దర్శనమిస్తుందని ఆలయ ప్రధాన అర్చకుడు శేషు తెలిపారు.
ఆలయానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. పొరుగు జిల్లాల నుంచి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం ఉచిత అన్నదానం ఏర్పాటు చేశామని భక్తులకు సరిపోను తీర్థ ప్రసాదాలు సమకూర్చామని అన్నారు. శాకంబరీ ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలగడంతోపాటు అన్నపానీయాలు సమృద్ధిగా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయని అర్చకులు తెలిపారు.
ఇదీ చూడండి : 9, 10 షెడ్యూలు సంస్థలపై నేడు సీఎంకు తుది నివేదిక