కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ పోలీసులు తమ ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, హాస్యనటుడు బాబు మోహన్ కొనియాడారు. లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసులు నిరంతరంగా విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. పోలీసులు చేస్తున్న సేవలు మరువలేనివని అభిప్రాయపడ్డారు. విధులు నిర్వహిస్తున్న పోలీసులకు హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే మార్గ మధ్యలో చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి మాస్క్‌లను బాబు మోహన్ అందజేశారు.
ఇదీ చూడండి: పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది