వినియోగదారుల హక్కులపై ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయాలని వినియోగదారుల కమిషన్ రాష్ట్ర అధ్యక్షుడు చక్రపాణి కోరారు. అమెరికాలో హక్కులు పటిష్ఠంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం పురస్కరించుకొని వరంగల్ నగరంలో చైతన్య సదస్సు నిర్వహించారు.
హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఈ సదస్సులో కమిషన్ రాష్ట్ర అధ్యక్షుడు చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వినియోగదారుల హక్కులు, వాటి ప్రయోజనాలపై సుదీర్ఘంగా చర్చ జరిపారు.
ఇదీ చూడండి: 'బ్యాంకుల ప్రైవేటీకరణ కేంద్రం వెనక్కి తీసుకోవాలి'