వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడిన ముగ్గురు సభ్యుల దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులంతా మధ్యప్రదేశ్‌కు చెందినవారని కమిషనర్ రవిందర్ తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకున్నామన్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో బెలూన్లు అమ్ముకుంటూ రైళ్లో వచ్చి తెలంగాణలో చోరీలకు పాల్పడుతున్నారని చెప్పారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి సుమారు 5 లక్షల రూపాయల విలువల గల 135 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి ఆభరణాలు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి : దేశవ్యాప్తంగా వైద్యం బంద్- రోగుల ఇక్కట్లు