ETV Bharat / state

ఎవరూ లేక ఒంటరై.. సాయం కోసం ఎదురుచూస్తూ.. జామ చెట్టు కిందే జీవనం

భార్య చనిపోయిన బాధను దిగమింగుకునేలోపే.. ఆ భర్తను పక్షవాతం మంచాన పడేసింది. కుటుంబంలో పెద్ద దిక్కు మంచాన పడటంతో.. పిల్లల పరిస్థితి దయనీయంగా మారింది. నిలువ నీడ లేక.. నిస్సహాయ స్థితిలో బతకడం కష్టంగా మారింది. ఇప్పుడు వృద్ధాప్యంలో చూసుకునే వారు లేక.. చుట్టుపక్కల వారు ఓ ముద్ద పెడితే కడుపు నింపుకునే పరిస్థితి నెలకొంది. కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఇల్లు, ఆర్థికంగా బలంగా లేని కుమారుడు.. రకరకాల కష్టాలతో బతుకు జీవుడా అంటూ జీవనం సాగిస్తున్నారు హనుమకొండ జిల్లాకు చెందిన సదయ్య.

A Old Man waiting for Help
ఎవ్వరూ లేక ఒంటరై.. సాయం కోసం ఎదురుచూస్తూ..
author img

By

Published : May 22, 2023, 2:01 PM IST

ఎవ్వరూ లేక ఒంటరై.. సాయం కోసం ఎదురుచూస్తూ..

హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ విలీన గ్రామం సీతారాంపురానికి చెందిన అడప సదయ్యకు సుమారు 54 సంవత్సరాలు. ఆయనకు ఒక కుమారుడు, ఓ కుమార్తె. ఆస్తిపాస్తులు ఏమీ లేవు. 15 సంవత్సరాల క్రితం భార్య చనిపోయింది. ఆ బాధ నుంచి కోలుకోకముందే.. పక్షవాతం వచ్చింది. 13 సంవత్సరాల క్రితం సదయ్యకు పక్షవాతం రావడంతో కుటుంబానికి అండగా ఉండాల్సిన పెద్ద దిక్కు వీల్ ఛైర్‌​తో మంచానికి పరిమితమయ్యాడు.

నిరుపేద కుటుంబానికి చెందిన సదయ్యకు.. అండగా ఉన్న స్థానికులు.. తలో చేయి వేసి అతని కుమార్తె వివాహం జరిపించారు. ఉన్న కుమారుడొక్కడు దూరంగా ఉండటంతో.. సదయ్యను చూసుకునే వారు కరవయ్యారు. ఈ నేపథ్యంలో సదయ్యకు కనీసం తిండి పెట్టే వారు కూడా లేరు. చుట్టుపక్కల వారు దయతలచి ఒక ముద్ద పెడితే కడుపు నిండుతుంది. లేదంటే బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూసే దీన స్థితి.

పింఛనే ఆధారం.. : సదయ్యకు ప్రతి నెలా వచ్చే పింఛన్‌ డబ్బులే ఆధారం. ఆ డబ్బులతోనే తన జీవితం కొనసాగుతుంది. సదయ్యకు ఆస్తిపాస్తులే కాదు.. కనీసం ఉండటానికి ఇల్లు కూడా సరిగ్గా లేకపోవడంతో.. ఎండావానలకు అవస్థలు పడుతున్నారు. ఇల్లు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి. ఇటీవల కురిసిన వర్షాలకు ఇల్లు దెబ్బ తినడంతో.. కూలుతుందేమోననే భయానికి బతుకు జీవుడా అంటూ జామ చెట్టు కిందే కాలం వెళ్లదీస్తున్నారు. పక్షవాతంతో 13 ఏళ్ల నుంచి సదయ్య పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"సదయ్య భార్య చనిపోయింది. అతని ఇద్దరి పిల్లలు ఎవరి జీవితాలు వారు చూసుకుని ఇతడిని పట్టించుకోవడం లేదు. తన ఇల్లు అంతా పాడుబడిపోయింది. ఆ ఇల్లు కూలుతుందేమోనని భయపడి బయట ఉన్న చెట్టు కిందే కాలం గడుపుతున్నాడు. ఇరుగుపొరుగు వారం అప్పుడప్పుడు ఆహారం అందిస్తున్నాం. ఆయన కుమార్తెకు స్థానికులమంతా కలిసి పెళ్లి చేశాం. సదయ్యకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. వర్షాలు వచ్చినప్పుడు అతనికి చాలా ఇబ్బందిగా ఉంది. స్థానిక ఎమ్మెల్యే వచ్చి ఒక్కసారి ఆయన పరిస్థితి చూసి చిన్న ఇల్లు కట్టించాలని కోరుతున్నాం." -స్థానికులు

గూడు అవసరం..: శిథిలావస్థలో ఉన్న ఇంటిని తీసి వేసి.. సదయ్యకు ఒక చిన్న గది ఏర్పాటు చేస్తే బాగుంటుందంటూ స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న సదయ్యకు ప్రభుత్వం చిన్న ఇల్లు కట్టించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం, దాతలు సహృదయంతో స్పందించి.. సదయ్యకు ఒక గూడు నిర్మించి ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. తిన్నా తినకున్నా తన ఇంట్లో తాను ఉండడానికి అవకాశం ఉంటుందంటూ చెప్తున్నారు. పక్షవాతం వచ్చినప్పటి నుంచి సదయ్య గోస వర్ణనాతీతంగా ఉందంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.