ETV Bharat / state

నిలిచిపోయిన రైళ్ల ప్రయాణికులకు ప్రత్యామ్నాయాలు

కర్నూల్​ నుంచి కాచిగూడ మధ్య నడిచే రైళ్ల రాకపోకలు నిలిచిపోవటం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే స్టేషన్​లలో కిక్కిరిసిపోయిన ప్రయాణికులకు ప్రత్యామ్నాయం చేసేందుకు అధికారులు యత్నిస్తున్నారు.

Alternatives for passengers of stalled trains
author img

By

Published : Oct 9, 2019, 9:19 PM IST

కర్నూల్​- కాచిగూడ మధ్య రాళ్ల రాకపోకలు నిలిపోయి ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు అధికారులు ప్రత్యామ్నాయాలు చేస్తున్నారు. మన్యంకొండ స్టేషన్ సమీపంలో పట్టాలపై ఒకవైపు ఒరిగి పడిపోయిన రైల్​ ఇంజిన్ భోగిని తొలగించే వరకు రైళ్ల రాకపోకలు జరిగే అవకాశం లేకపోవటం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంత మంది దగ్గర్లో ఉన్న బస్టాండ్​లకు ప్రయాణమవుతున్నారు.

మహబూబ్​నగర్ జిల్లా మన్యంకొండ రైల్వేస్టేషన్ సమీపంలో ట్రాక్ మరమ్మతులు చేసే యంత్రం ఇంజిన్ పట్టా తప్పింది. ఈ ఘటనతో కర్నూల్ నుంచి కాచిగూడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సాయంత్రం ఐదు గంటలకు కర్నూల్ నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన తుంగభద్ర ఇంటర్సిటీ ఎక్స్​ప్రెస్​ను దేవరకద్ర రైల్వేస్టేషన్​లో నిలిపివేశారు. అంతకు ముందు వచ్చిన గూడ్స్ రైళ్లను మరో ట్రాక్​పై నిలిపేశారు.

నిలిచిపోయిన రైళ్ల ప్రయాణికులకు ప్రత్యామ్నాయాలు

ఇదీ చూడండి : రెండ్రోజుల కస్టడీకి ఈఎస్​ఐ నిందితులు

Intro:రైలు పట్టాలను ట్రాక్ ను మరమ్మతులు చేయవలసిన యంత్రము ఇంజన్ భోగి మన్నెంకొండ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలు మహబూబ్నగర్ జిల్లాలో నిలిచిపోయాయి.

Body:మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండ రైల్వే స్టేషన్ సమీపంలో లో రైల్వే ట్రాక్ మరమ్మతులు చేసే యంత్రం ఇంజన్ బోగీ పట్టా తప్పడంతో కర్నూల్ నుంచి కాచిగూడ మధ్య రాకపోకలు నిర్వహించే రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సాయంత్రం ఐదు గంటలకు కర్నూల్ నుంచి సికింద్రాబాద్ వెళ్లవలసిన తుంగభద్ర ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ను దేవరకద్ర రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు. అంతకు ముందుగా వచ్చిన గూడ్స్ రైళ్లను మరో ట్రాక్ పై నిలిపివేశారు. మన్యంకొండ స్టేషన్ సమీపంలో పట్టాలపై ఒకవైపు ఒరిగి పడిపోయిన రైలింజన్ భోగి ని తొలగించే వరకు రైళ్ల రాకపోకలు జరిగే అవకాశం లేకపోవడంతో. రైల్లో వెళ్ళవలసిన ప్రయాణికులు అన్నయ్య ప్రయాణం చేసేందుకు రైల్వే స్టేషన్ నుంచి కొంతమంది సమీపంలో ఉన్న దేవరకద్ర బస్ స్టేషన్ కు చేరుకున్నారు. పండుగ అ అనంతరం తిరుగు ప్రయాణం అవుతున్న ప్రయాణికులతో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సుల రాకపోకలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దానికితోడు రైలు ప్రయాణికులు అదనం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైలు పట్టాలపై నిలిచిపోయిన ఇంజన్ బోగిని తొలగించిన అనంతరం రాకపోకలను ఇస్తామని అధికారులు చెప్పడంతో కొంత మంది ప్రయాణికులు ఉండిపోయారు వారికి తాగునీటి సౌకర్యం, క్యాంటీన్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Conclusion:కర్నూల్ నుంచి కాచిగూడ మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు . రైలు ప్రయాణికులు బస్సు లో వెళ్లేందుకు పోలీసులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.