లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు వరంగల్‌కు రానున్నారు. అజంజాహి మిల్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఓరుగల్లు కోటలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు సీఎం చేరుకుంటారు. అక్కడి నుంచి సభాస్థలికి వెళతారు. సభ అనంతరం భువనగిరికి పయనమవుతారు. ఓరుగల్లు సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే నరేందర్‌తో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు.
ఇవీ చూడండి:భద్రాచలం కూడా మాదే: ఏపీ సీఎం చంద్రబాబు