వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలంలోని దేవునూర్, ముప్పారం గ్రామ రహదారిపై సోమవారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముప్పారం గ్రామానికి చెందిన మర్రిపెళ్ళి ఎల్లయ్య, అతడి భార్య, కుమారుడు గాయపడగా వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ద్విచక్ర వాహనంపై వున్న నారాయణగిరి గ్రామస్థుడు బుర్ర కుమార్ అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలు కాగా... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు మృతి చెందాడు. ఎల్లయ్య ద్విచక్ర వాహనంపై తీసుకొని వస్తున్న ఇనుప గడ్డపార తగలడం వల్లనే కుమార్ మృతి చెందాడని ఆరోపిస్తూ... మంగళవారం సాయంత్రం అతడి బంధువులు ఆందోళనకు దిగారు. కుమార్ మృతదేహాన్ని ముప్పారం గ్రామంలోని ఎల్లయ్య ఇంటిముందు పెట్టి నష్టపరిహారం చెల్లించే వరకు కదిలేది లేదని అక్కడే బైఠాయించారు. ఈ రోజు వరకు మృతదేహాన్ని అక్కడే ఉంచి ఆందోళన కొనసాగిస్తున్నప్పటికి కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ముప్పారం గ్రామస్తులు వాపోతున్నారు.
![మృతదేహంతో రెండు రోజులుగా ధర్నా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4197325_992_4197325_1566373526656.png)
ఇదీ చూడండి:ఈ ఊరికి మహాత్మా గాంధీ దేవుడయ్యాడు