విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆందోళనకు దిగారు. హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు విద్యార్థులు ర్యాలీ చేపట్టారు.
పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు విడుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో సరైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యారంగానికి పెద్దపీట వేస్తామని చెప్పిన తెరాస ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థను పట్టించుకోవట్లేదని ఆరోపించారు.
ఇవీ చూడండి: నేడు సహకార ఎన్నికలు... సాయంత్రం ఫలితాలు