దేశ మొదటి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన ఆజాద్ 131 జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పేద, మైనారిటీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా 204 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు, విద్యార్థులకు మెరుగైన వసతి, భోజన సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు.
ఇదీ చూడండి: శంభీపూర్ రాజు ఇంటిని ముట్టడించిన ఆర్టీసీ జేఏసీ