ETV Bharat / state

ఆ పాఠశాలలో బ్యాంకు.. విద్యార్థులే ఉద్యోగులు.. ఎక్కడంటే

School Bank Of Chilpur: అదో బ్యాంకు! అందులో ఉద్యోగులు బ్యాంకు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. రోజూ డబ్బులు తీసుకోవడం జమ చేయడం, రశీదులివ్వడం వీరి పని. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా. పట్టుమని పదిహేనేళ్లు కూడా దాటని పాఠశాల విద్యార్ధులు.. ఉద్యోగులుగా మారి నిర్దేశించిన సమయాల్లో.. ఈ బ్యాంకును నడిపిస్తున్నారు. అంటే ఇది పూర్తిగా పిల్లల కోసం పిల్లలే తమ పాఠశాలలో నడుపుతున్న బ్యాంకు. మరి ఈ బ్యాంకు ఎక్కడ ఉందో పదండి చూసొద్దాం.

School Bank Of Chilpur
School Bank Of Chilpur
author img

By

Published : Nov 26, 2022, 4:28 PM IST

ఆ పాఠశాలలో బ్యాంకు.. విద్యార్థులే ఉద్యోగులు.. ఎక్కడంటే

School Bank Of Chilpur: పుస్తకాలు పట్టి తరగతి గదుల్లో చదువుకుంటున్న వీరంతా జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు. అయితే మిగతా పాఠశాలలోని విద్యార్థుల కన్నా వీరు భిన్నం, ఎందుకంటారా? వీరే సొంతంగా బ్యాంకు నడుపుతున్నారు మరీ. అచ్చంగా బ్యాంకు పోలిన బ్యాంకునే పాఠశాలలో నిర్వహిస్తున్నారు. డబ్బులు తీసుకునేందుకు విత్ డ్రా ఫామ్‌, డబ్బు తీసుకున్నందుకు రశీదులు.. ఇలా మొత్తం బ్యాంకులో ఎలా ఉంటుందో.. అచ్చం అలాగే ఈ పిల్లల బ్యాంకు ఉంటుంది.

అందుకే దీనికి స్కూల్ బ్యాంకు ఆఫ్ చిల్పూర్ అని పేరు పెట్టారు. రోజూ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అరగంట సేపు బ్యాంకు కార్యకలాపాలు జరుగుతాయి. బ్యాంకు మేనేజర్, అకౌంటెంట్‌, క్యాషియర్, క్లర్క్ ఉద్యోగులుగా ఎంపిక చేసిన విద్యార్ధులు పనిచేస్తున్నారు. బ్యాంకు ప్రారంభానికి ముందే వీరికి బ్యాంకుల్లో జరిగే లావాదేవీలు, నగదు స్వీకరణ, .. తదితర విషయాలపై అవగాహన కల్పించడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యకలాపాలు జరుగుతున్నాయి.

చిన్నతనంలోనే పొదుపుకి బాట వేసింది: తల్లిదండ్రులిచ్చే డబ్బులను విద్యార్థులు దాచుకుని పాఠశాలలో తమ ఖాతాలో జమ చేసి, కావాల్సినప్పుడు తీసుకుంటారు. ఇందుకోసం విత్ డ్రా ఫామ్స్‌, ఇతర రశీదులను ప్రత్యేకంగా ముద్రించారు. ప్రతి విద్యార్థికి గుర్తింపు కార్డుతో కూడిన పాస్‌ బుక్‌ ఇచ్చారు. బ్యాంకు లావాదేవీలపై తెలియని విషయాలు తెలుసుకున్నామని.. చిన్నతనంలోనే పొదుపుకి బాట వేసిందని విద్యార్థులు చెబుతున్నారు. సొంతంగా బ్యాంకు నిర్వహించుకోవడం వల్ల ఎన్నో విషయాలను నేర్చుకున్నామని అందులో పనిచేస్తున్న పిల్లలు చెబుతున్నారు.

158 మంది విద్యార్దులూ ఈ బ్యాంకు ఖాతాదారులే: చాలా మంది పిల్లలకు బ్యాంకుల గురించి అంతగా తెలియదు. బ్యాంకుల కార్యకలాపాలపై పాఠాలు ఉన్న అనుభవపూర్వకంగా తెలియచేసి ఉద్దేశంతో.. పాఠశాల సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు అక్టోబర్ 15న ఈ బ్యాంకు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ప్రధానోపాధ్యాయురాలు కూడా ప్రోత్సహించడంతో నెలన్నర క్రితం పాఠశాలలోని ఓ గదిలో బ్యాంకు ప్రారంభమైంది. ఈ నెల 24 నాటికి రూ.41 వేల దాకా బ్యాంకులో జమ అయింది. పాఠశాలలో ఉన్న 158 మంది విద్యార్దులూ ఈ బ్యాంకు ఖాతాదారులే. తమ ఖాతాలో జమ చేసుకున్న మొత్తం చూసుకుని వారంతా తెగ సంబరపడిపోతున్నారు.

"ఉత్సాహవంతులైన పిల్లలకు శిక్షణ ఇచ్చి మేనేజర్లుగా, క్యాషియర్​లుగా పనిచేస్తున్నారు. నిజమైన బ్యాంకులు ఏ విధంగా పనిచేస్తున్నాయో మా బ్యాంకు అదే విధంగా పనిచేస్తుంది. రికార్ఢులు, విత్ డ్రా ఫామ్స్‌, ఇతర రశీదులు ఉన్నాయి. అందుకే నెలలోపే రూ.41 వేల దాకా బ్యాంకులో జమయ్యాయి." - లీల, ప్రధానోపాధ్యాయురాలు, జడ్పీహెచ్ఎస్‌

రోజు మా ఇంటి నుంచి రూ.20 నుంచి రూ.25 దాచుకుంటున్నాం. అప్పుడు అనవసర ఖర్చులు చేసేవాళ్లం. ఇప్పుడు మాకు బ్యాంకు సంబంధించిన విషయాలు తెలుసుకున్నాను. ఇలా డబ్బులు దాచుకొని స్వంత అవసరాలకు వాడుకుంటున్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది. - విద్యార్థులు

ఇవీ చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. రెండో రోజు సిట్ విచారణకు న్యాయవాది ప్రతాప్

తన వర్గం ఎమ్మెల్యేలతో అసోంకు శిందే.. స్పెషల్ విమానంలో.. కారణం ఇదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.