ETV Bharat / state

కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్​ కలకలం - 78 మంది విద్యార్థుల సస్పెండ్​ - Warangal Ragging news

78 Students Suspended For Ragging in Kakatiya University : కేయూలో ర్యాగింగ్​ కలకలం రేగింది. కొన్నాళ్లుగా స్తబ్ధుగా ఉన్న ఈ వికృత క్రీడ మళ్లీ జడలు విప్పుతోంది. ర్యాగింగ్​ నియంత్రణకు ఉన్న చట్టాలు, నిబంధనల అమలు తీరును ఇలాంటి వరుస ఘటనలు ప్రశ్నిస్తున్నాయి. తాజాగా వరంగల్​లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్​కు పాల్పడిన 78 మంది విద్యార్థులపై సస్పెన్షన్​ వేటు పడింది.

78 Students Suspended For Ragging in Kakatiya University
'కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్​ కలకలం - 78 మంది విద్యార్థులను సస్పెండ్​ చేసిన యాజమాన్యం'
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 23, 2023, 10:17 AM IST

78 Students Suspended For Ragging in Kakatiya University : వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్‌కు పాల్పడిన 78 మంది విద్యార్థులను వారం రోజుల పాటు వసతి గృహాల నుంచి సస్పెండ్ చేశారు. విశ్వ విద్యాలయం చరిత్రలో ఇంత మంది విద్యార్థులను ఒకేసారి సస్పెండ్ చేయడం ఇదే ప్రథమం. ఈ నెల 20న కేయూలో విద్యార్థుల ర్యాగింగ్ బయటపడింది. వెంటనే స్పందించిన యూనివర్సిటీ అధికారులు పరిచయాల పేరుతో ర్యాగింగ్‌కు పాల్పడుతున్న పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ర్యాగింగ్‌కు పాల్పడిన వారిని గుర్తించారు.

Ragging At Mahabubabad Medical College : మళ్లీ ర్యాగింగ్‌ కలకలం.. మహబూబాబాద్‌ మెడికల్‌ కాలేజీలో ఏడుగురు విద్యార్థులు సస్పెండ్

Director Of KU Said Take Action Against Ragging : ప్రధానంగా పద్మావతి మహిళా వసతి గృహంలో ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థినుల వివరాలను సేకరించారు. అన్ని విభాగాల్లోనూ ఈ ర్యాగింగ్ భూతం విస్తరించినట్లు గుర్తించారు. వాణిజ్య శాస్త్రం, జంతుశాస్త్రం, ఆర్థిక శాస్త్రం విభాగాల్లోని మొత్తం 78 మంది విద్యార్థినీ విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు కేయూ వసతి గృహాల సంచాలకుడు ఆచార్య వై.వెంకయ్య వెల్లడించారు. ఇంకెవరైనా ర్యాగింగ్‌కు(Ragging) పాల్పడ్డారా అనే వివరాలు సేకరిస్తున్నామని, సరైన ఆధారాలు లభిస్తే వారినీ సస్పెండ్ చేస్తామన్నారు.

Raging in Gandhi Medical College : గాంధీ మెడికల్​ కాలేజీలో ర్యాగింగ్ రగడ.. ధర్నాకు దిగిన విద్యార్థులు

గతంలో కాకతీయ మెడికల్​ కళాశాలలో ర్యాగింగ్​ భూతం కలకలం

7 Students Suspended in Kakatiya Medical College in Warangal : వైద్య కళాశాల్లో ర్యాగింగ్​ కలకలం సృష్టిస్తోంది. విద్యార్థులు ర్యాగింగ్​ చేయడం వల్ల వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఆ ర్యాగింగ్​కు బాధితులైన వారు కాలేజ్​ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ర్యాగింగ్​కు పాల్పడిన వ్యక్తులపై తగిన చర్యలు తీసుకుంటున్నారు. కేయూలో (Kakatiya Medical College) ర్యాగింగ్​ చేసినందుకు గతంలోనూ పలువురు విద్యార్థులను సస్పెండ్​ చేశారు. అయితే ఇంత మందిని ఒకేసారి సస్పెండ్​ చేయడం మాత్రం ఇదే తొలిసారి.

ర్యాగింగ్‌ పేరుతో సీనియర్ల టార్చర్.. 34 మంది విద్యార్థులు సస్పెండ్

కాలేజ్​లో ర్యాగింగ్​ భూతం.. 'సార్​' అన్లేదని జూనియర్​ను చితకబాదిన సీనియర్లు.. భుజం విరగ్గొట్టి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.