తెలంగాణలో కరోనా మహమ్మారి క్రమంగా రెక్కలు విప్పుకుంటోంది. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కొత్త కరోనా కేసులు వస్తున్నాయి. అధికారులు ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నా.. ప్రజలు అంతగా ఆసక్తి చూపడం లేదు. బహిరంగ ప్రదేశాల్లోనూ మాస్క్ లేకుండా తిరుగుతున్నారు. దీంతో అనుమానిత ప్రాంతాల్లో అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
వరంగల్ నగరం కాజీపేట మండలం కడిపికొండలో 20 మందికి వైరస్ బారిన పడ్డారు. విషయం తెలిసిన వైద్యఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది హుటాహుటిన కడిపికొండ చేరుకొని ఇంటింటికీ వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇటీవల ఓ వ్యక్తి చనిపోగా...ఆయన అంత్యక్రియల్లో చాలామంది పాల్గొనడంతో...వైరస్ వ్యాప్తి చెందినట్లు అధికారులు గుర్తించారు. ఒకే ఇంట్లో 13 మంది వ్యాధి బారిన పడినట్లు అధికారులు వివరించారు. అందరికీ టెస్టులు చేయడంతో...కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి.
ఇదీ చూడండి: కవ్వింపుగా వలవేసి... వేధించి ఉసురు తీసి