ETV Bharat / state

వరంగల్​ అర్బన్​ జిల్లాలో 117 కరోనా కేసులు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఇవాళ 186 కేసులు నమోదు కాగా... వరంగల్ అర్బన్​ జిల్లాలోనే 117 కేసులు రావడం అందోళన కలిగిస్తోంది.

warangal urban district corona cases
వరంగల్​ అర్బన్​ జిల్లాలో 117 కరోనా కేసులు
author img

By

Published : Jul 20, 2020, 6:04 AM IST

వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతోంది. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 186 మందికి కొవిడ్​ పాజిటివ్​గా వైద్యులు నిర్ధరించారు. ఇందులో వరంగల్ అర్బన్​లో అత్యధికంగా 117 కేసులు నమోదయ్యాయి. వరంగల్ గ్రామీణ జిల్లాలో 41, జనగామ 5, ములుగు 2, మహబూబాబాద్ 21 కేసులు వచ్చాయి. ర్యాపిడ్, యాంటిజన్ కిట్ల ద్వారా కొవిడ్​ పరీక్షలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరగడం జిల్లావాసుల్లో ఆందోళన కలిగిస్తోంది.

ఇప్పటికే కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయిన నగర మేయర్ గుండా ప్రకాష్ రావు దంపతులు చికిత్స నిమిత్తం హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. మేయర్​తో సన్నిహితంగా ఉన్నవారిలో కొందరు హోమ్ క్వారంటైన్​లో ఉండగా మరికొందరు పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు హోం ఐసోలేషన్​లో ఉన్నవారిలో ఎక్కువ మంది కోలుకోవడం విశేషం.

ఇదీ చదవండి : రాష్ట్రంలో కొత్తగా 1296 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.