నిరుద్యోగ భృతిని తక్షణమే విడుదల చేయాలని యూత్ కాంగ్రెస్ వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లో నిరుద్యోగ భృతి అంశంపై మాట్లాడకపోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు.
యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆదేశాలతో ఈ రోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని భయపడిన ప్రభుత్వం.. అక్రమ అరెస్టులు చేయిస్తున్నారన్నారు.
"తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంటికో ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి.. ఈ రోజు నిరుద్యోగులను మరిచారు. నిరుద్యోగులంతా ఏకమై హామీలను నెరవేర్చే విధంగా ఉద్యమించాలి. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కొట్లాడి కొలువులు తెచ్చుకుందాం."
- కొయ్యడ శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షులు
ఇదీ చూడండి: మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణలోనే అద్భుతంగా..: హరీశ్‌రావు