రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులు, కుంటల్లో పుష్కలమైన నీరు వచ్చి చేరిందని వరంగల్ గ్రామీణ జిల్లా మొగుళ్లపల్లి మండలంలో జడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి పేర్కొన్నారు. త్వరలోనే రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభిస్తామని ఆమె పేర్కొన్నారు.
రైతులను రాజుల్లా చూడాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ నియంత్రిత సాగు విధానాన్ని ప్రవేశపెట్టారని.. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రైతుల రుణమాఫీ కోసం రూ. 1,200 కోట్ల నిధులను మంజూరు చేశారని ఆమె చెప్పారు. ఇది దృష్టిలో పెట్టుకుని రైతులంతా సీఎం చెప్పిన పంటలనే సాగు చేయాలని గండ్ర జ్యోతి కోరారు.