వరంగల్ అర్బన్ జిల్లా ముల్కనూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం విఫలమైందని ఆరోపిస్తూ భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం లేదంటూ.. పంచాయతీ కార్యాలయ ముట్టడికి ప్రయత్నించారు.
విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భాజపా నాయకులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. గ్రామపంచాయతీ భూములు కబ్జాకు గురవుతుంటే.. వాటిని రక్షించేందుకు పాలకవర్గం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతూ.. ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పంచాయతీ పాలకవర్గం వెంటనే సమస్యలను పరిష్కరించాలని లేదంటే భాజపా ఆధ్వర్యంలో పెద్దఎత్తున దీక్షలు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు
ఇదీ చదవండి:ప్రశ్నించడం కాదు పరిష్కారం చేసి చూపిస్తాం: మంత్రి హరీశ్