వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో శివరాత్రి పర్వదినానికి దేవాలయాలన్నీ సిద్ధమయ్యాయి. రేపు జరిగే శివ కల్యాణం, జాగరణ మహోత్సవ కార్యక్రమాలకు అశేషంగా వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయలపాలక వర్గాలు తెలిపాయి.
భక్తులు రాత్రి ఉండడానికి జాగారం చేయడం కోసం కావలసిన అన్ని ఏర్పాట్లు పరకాలలోని శైవ క్షేత్రమైన కుంకుమేశ్వర స్వామి ఆలయంలో పూర్తి చేసినట్లు ఆలయ విశిష్ట పూజారి, వేద పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ సంపత్ శర్మ తెలిపారు.
మహా శివరాత్రి సందర్భంగా జరిగే రేపటి కార్యక్రమానికి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని.. శివ జాగరణలో పాల్పంచుకుని.. శివనామస్మరణతో తరించి ముక్కంటేశ్వరుని కృపకు పాత్రులు కావాలని ఆయన ప్రజలకు కోరారు.
ఇదీ చూడండి: ట్రంప్‌కి గుడికట్టి పూజలు చేస్తున్న వీర భక్తుడు