Special Story on Warangal Sisters Nainika Thanaya : జింక పిల్లల్లా ఆడుతున్న ఈ చిన్నారుల పేర్లు.. నైనిక, తనయ. నవ్వుతూ తుళ్లుతూ కనిపిస్తున్న వీరు.. చక్కగా నృత్యాలు చేస్తూ.. మధురంగా పాడతారు కూడా. వీరు ఉండేది అమెరికాలోని నార్త్ కరొలినా రాష్ట్రమైనా... స్వగ్రామం మాత్రం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద. నైనిక ఏడోతరగతి, తనయ ఐదో తరగతి చదువుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో వేసవి సెలవులివ్వడంతో.. తల్లిదండ్రులు వీరిని వరంగల్‌లోని బంధువుల ఇళ్లకు తీసుకొచ్చారు. నైనిక, తనయ.. కలసి స్టెప్పులేస్తూ తమ ఆటపాటలను యూట్యూబ్వో అప్ లోడ్ చేస్తున్నారు. అంతే కాదు లక్షలాది మంది అభిమానులను దోచుకుంటూ వారెవ్వా అనిపించుకుంటున్నారు.
'నా పేరు నైనిక. నాకు 12 సంవత్సరాలు. ఇప్పుడు ఆరో తరగతి అయిపోయింది ఏడో తరగతిలో జాయిన్ అవ్వాలి. ఇప్పుడు అమెరికాలో వేసవి సెలవులు కావున ఇండియాకి వచ్చాం. మా నాన్న గారు వరంగల్‌లోనే ఉంటారు. చుట్టాలందరూ ఇక్కడే ఉంటారు. నైనిక తనయ అనే పేరుతో య్యూటూబ్ ఛానల్‌ని కామన్‌గా ప్రారంభించాం. ఇక్కడికి వస్తమని అసలు అనుకోలేదు. ఒక డ్యాన్స్ ప్రోగ్రాం వీడియోలో చూస్తూ నేర్చుకున్నాం. ఆ వీడియోను య్యూటూబ్‌లో పెట్టాం.. చాలా మంది చూశారు. అలాగే మేము డ్యాన్స్ చేసిన బుల్లెట్టు బండి, రారా రక్కమ్మా, నాటునాటు.. లాంటి సాంగ్స్ చాలా బాగా పేరు తెచ్చాయి.'-నైనిక, వరంగల్
అద్భుత ప్రతిభను చాటుకుంటున్న అక్కచెల్లెళ్లు : కరోనా సమయంలో.. ఈ ఇద్దరు అక్కచెల్లెళ్లూ.. ఓ సాంస్కృతిక కార్యక్రమం కోసం డ్యాన్స్ నేర్చుకున్నారు. అది రద్దవటంతో.. నేర్చుకున్న ఆ నృత్యాన్ని సరదాగా యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశారు. దానికి మంచి ఆదరణ రావడంతో.. సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి.. తమ ఆట పాటల వీడియోలు.. పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. దాదాపు 150 వరకు చేశారు. ప్రస్తుతం ఈ చిన్నారుల ఛానల్‌కు 35 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అదరగొట్టే స్టెప్పులేస్తూ చేసిన వీడియోలను.. పదికోట్ల మంది వీక్షించారు.
'నా పేరు తనయ. నాలుగో తరగతి అయిపోయి అయిదో తరగతికి వెళుతున్నాను. మేము నేర్చుకున్న దాని యూట్యూబ్‌లో పెట్టాలనుకున్నాం. దాంతో ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి అందులో అప్లోడ్ చేస్తున్నాం. అందులో మేము పెట్టిన చాలా సాంగ్స్, డ్యాన్స్ వీడియోలను చాలా మంది చూసి మెచ్చుకున్నారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ట్విటర్లో మా డ్యాన్స్ చూసి అప్రిసియేట్ చేశారు. నాకు ఇండియా చాలా నచ్చింది. నాకు సైంటిస్ట్, సింగర్, రైటర్ కావాలని ఉంది.'-తనయ, వరంగల్
అదిరిపోయే స్టేప్పులతో ఫిదా చేస్తున్న ఓరుగల్లు అక్కచెల్లెళ్లు : అమెరికాలో ఉంటున్నా వీరు తెలుగు చక్కగా మాట్లడటంతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తున్నారు. పిల్లలు యూట్యూబ్ వేదికగా పేరు సంపాదించుకోవడం ఎంతో గర్వంగా ఉందని చిన్నారుల బంధువులు చెబుతున్నారు. అన్నట్లు వీరి ఒక్క తెలుగు భాషలోనే కాదు.. హిందీ, ఆంగ్ల భాషలతో పాటు తమిళ్, మళయాళం, కన్నడ భాషల్లో కూడా పాటలకు తగిన స్టెప్పులేస్తూ... వీక్షకుల మనస్సు దోచుకుంటున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో.. చదువులోనూ.. డ్యాన్సుల్లోనూ రాణిస్తూ అందరితో సెహభాష్ అనిపించుకుంటున్నారు ఈ చిన్నారులు.
ఇవీ చదవండి :