ETV Bharat / state

రైతు వేదికల నిర్మాణం గడువులోపు పూర్తి చెయ్యకపోతే చర్యలు తప్పవు: జిల్లా కలెక్టర్​

దసరాలోపు రైతువేదికల నిర్మాణాలు పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్​ హరిత... అధికారులను హెచ్చరించారు. వరంగల్​ గ్రామీణ జిల్లాలోని సంగెం, పర్వతగిరి మండలాల్లో పర్యటించిన ఆమె.. రైతువేదక నిర్మాణ పనులను పరిశీలించారు.

రైతు వేదికల నిర్మాణం గడువులోపు పూర్తి చెయ్యకపోతే చర్యలు తప్పవు: జిల్లా కలెక్టర్​
రైతు వేదికల నిర్మాణం గడువులోపు పూర్తి చెయ్యకపోతే చర్యలు తప్పవు: జిల్లా కలెక్టర్​
author img

By

Published : Sep 21, 2020, 8:17 PM IST

రైతు వేదికల నిర్మాణంలో అలసత్వం ప్రదర్శిస్తే అధికారులపై చర్యలు తప్పవని వరంగల్​ గ్రామీణ జిల్లా పాలనాధికారి హరిత హెచ్చరించారు. దసరాలోపు నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలోని సంగెం, పర్వతగిరి మండలాల్లో పర్యటించారు. నిర్మాణంలో ఉన్న రైతు వేదికలను పరిశీలించిన ఆమె.. పనుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

జిల్లాలోని అన్ని గ్రామాల్లో డంపింగ్ యార్డ్, స్మశాన వాటికలు, నర్సరీల నిర్వహణ సక్రమంగా ఉండేలా స్థానిక ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరంతరం పర్యవేక్షించి సమస్యలేమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు.

ఇదీ చూడండి: రెవెన్యూ శాఖ పదోన్నతులపై కొనసాగుతోన్న సర్కార్​ కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.