వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో కలెక్టర్ హరిత పర్యటించారు. నత్తనడకన సాగుతున్న రైతు వేదికల నిర్మాణ పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
దసరా నాటికి రైతు వేదికలు పూర్తి చేయాలన్న ఆదేశాలను అధికారులు విస్మరించడం సరికాదని మండిపడ్డారు. గడువు నాటికి నిర్మాణాలు పూర్తికాకపోతే చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కావాల్సిన నిధులున్నా.. పనులు పూర్తిచేయకపోవడంపై కలెక్టర్ హరిత అసహనం వ్యక్తం చేశారు.