చెరువులు మాయమైనందు వల్లే వరంగల్‌కు వరదల ముప్పు వస్తోందని ఎన్‌ఐటీ విశ్రాంత ఆచార్యులు పాండురంగారావు అభిప్రాయపడ్డారు. వరంగల్ పరిసరాల్లో 247 చెరువులు ఉండాలి, కానీ ప్రస్తుతం 52 చెరువులు కనిపించడం లేదన్నారు. చెరువులు ఆక్రమించి కాలనీలు నిర్మించారని అన్నారు.
కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువుల సూత్రాన్ని తెంచేయడం వల్లే ప్రమాదం ముంచుకోస్తుందని తెలిపారు. చారిత్రక నగరానికి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం పెద్ద లోటుని చెప్పారు. నాలాలను విస్తృత పరిచి ఆక్రమణలు తొలగించాలని సూచించారు. వర్షపు నీటిని ఒడిసి పట్టుకునేలా ఇంకుడు గుంతలు నిర్మించాలన్నారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో మూడ్రోజుల పాటు మోస్తరు వర్షాలు