మక్క రైతుల ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని వరంగల్ గ్రామీణ జిల్లా శాయంపేట ఎంపీపీ తిరుపతి రెడ్డి హామీ ఇచ్చారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో పీఎసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.
వ్యవసాయ విస్తరణ అధికారులు అందించిన కూపన్ల ప్రకారం మక్కలు కాంటాలు అవుతున్నాయని, రవాణా సమస్యతో తూకం వేసిన మక్కలు ఎగుమతి కాక కేంద్రాల వద్ద నిరీక్షించాల్సి వస్తుందని రైతులు ఎంపీపీ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎంపీపీ రవాణా కాంట్రాక్టర్లతో ఫోన్లో మాట్లాడారు. హుజూరాబాద్ దగ్గర నంగునూరులో దిగుమతి అవుతున్నాయని, నాలుగు రోజులు పడుతుండడం వల్ల ఆలస్యం అవుతున్నట్లు తెలిపారు.