వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల నియోజకవర్గంలోని పల్లెల్లో మౌలిక వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు, అధికారులతో సమావేశమై పల్లెల అభివృద్ధిపై ఎమ్మెల్యే చర్చించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లెప్రగతి వల్ల గ్రామాలన్నీ సమగ్రాభివృద్ధి చెందుతున్నాయని ధర్మారెడ్డి అన్నారు. గ్రామాల అభివృద్ధికి ఎన్ని నిధులైన ఇవ్వడానికి సీఎం సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గ్రామాల సర్పంచ్లు, అధికారులు పల్లెల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలని... గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
ఇదీ చూడండీ : జిలుగు సాగును సందర్శించిన మంత్రి ఈటల రాజేందర్