నల్లా నీళ్లు రావడం లేదని ఆరోపిస్తూ వరంగల్ గ్రామీణ జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంట్ల గ్రామస్థులు రోడ్డుపై ముళ్ల కంపలు వేసి నిరసన ప్రదర్శన చేపట్టారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వారితో మాట్లాడి ముళ్లకంపను తొలగించారు.
ఆరు నెలలుగా తమకు నల్లా నీళ్లు రావడం లేదని గ్రామస్థులు తెలిపారు. ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. గ్రామంలో రైతువేదిక ప్రారంభోత్సవానికి మంత్రులు వస్తున్నారని తెలియడంతో తమ సమస్యలు విన్నవించుకునేందుకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఫోన్లు కొనిచ్చి... 'సెల్రాజు'గా మారిన సీఐ