రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాహనాల చోరీకి పాల్పడుతున్న ఓ ముఠాను వరంగల్ రురల్ జిల్లా పరకాల పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు నిందితుల నుంచి 4 ఆటోలు, 7 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
నిర్మానుష్య ప్రాంతాల్లో నిలిపే వాహనాలే లక్ష్యంగా చేసుకొని నిందితులు ఈ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. గత డిసెంబర్ నుంచి ఇప్పటివరకూ.. వరంగల్, భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్ ప్రాంతాలకు చెందిన 24 వాహనాలను చోరీ చేసినట్లు తెలిపారు. వారిలో పలువురు.. గతంలో పలు కేసులకు సంబంధించి శిక్ష అనుభవించినట్లు వివరించారు.
పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి ఏసీపీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కేసులో చురుకుగా వ్యవహరించిన పరకాల ఇన్స్పెక్టర్ మహేందర్, ఎస్ఐ శ్రీకాంత్, తదితర సిబ్బందిని ఈస్ట్ జోన్ డీసీపీ వెంకట లక్ష్మి, పరకాల ఏసీపీ శ్రీనివాస్‌లు ప్రత్యేకంగా అభినందించారు.
ఇదీ చదవండి: వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్