ETV Bharat / state

'పల్లె ప్రగతిలో చేపట్టిన అన్ని పనులు పూర్తి చేయాలి' - vardannapeta mla ramesh latest

పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో చేపట్టిన అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ దిశానిర్దేశం చేశారు. హన్మకొండ ప్రశాంత్ నగర్​లోని తన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

vardannapeta mla ramesh review meeting on palle pragathi programme
'పల్లె ప్రగతిలో చేపట్టిన అన్ని పనులు పూర్తి చేయాలి'
author img

By

Published : Nov 10, 2020, 8:46 AM IST

శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, ప్రకృతి వనాలు వంటి అభివృద్ధి పనుల పురోగతిపై ఐనవోలు మండల ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులతో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సోమవారం​ భేటీ అయ్యారు. వరంగల్ గ్రామీణ జిల్లా హన్మకొండ ప్రశాంత్ నగర్​లోని తన నివాసంలో అధికారులతో సమీక్షించారు. పల్లె ప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

ముఖ్యంగా శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, ప్రకృతి వనాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఐనవోలు మండల పరిధిలోని ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: చిన్న పరిశ్రమలకు కొత్తతరం సాంకేతిక పరిజ్ఞానం..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.