వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో తెరాస ఘనవిజయం సాధించబోతోందని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్ అన్నారు. ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట నియోజక వర్గ పరిధిలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రులు హాజరైయ్యారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమష్టిగా ముందుకు సాగాలని మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. వ్యక్తిగత కారణాలు ఏవైనా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని తెరాస శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో ఓటరు నమోదు శాతాన్ని పెంచే విధంగా ప్రజాప్రతినిధులు కృషిచేయాలని సూచించారు. పట్టభద్రుల ఎన్నికల్లో తెరాస ఘనవిజయం సాధించబోతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.