ETV Bharat / state

బంగారు తెలంగాణ తెరాసతోనే సాధ్యం: ఎర్రబెల్లి - వరంగల్ వార్తలు

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణాలకు తెగించి తెలంగాణను తీసుకువచ్చారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు సాగించారని వెల్లడించారు. కేసీఆర్ నాయకత్వంలో మంత్రిగా పనిచేయడం సంతోషంగా ఉందని తెలిపారు.

trs party 21st formation day celebrations at hanamkonda
బంగారు తెలంగాణ తెరాసతోనే సాధ్యం: ఎర్రబెల్లి
author img

By

Published : Apr 27, 2021, 11:03 AM IST

రాష్ట్రంలో తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెరాస నాయకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్​ హన్మకొండలోని అమరవీరుల స్థూపం వద్ద మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​ రావు, సత్యవతి రాఠోడ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండా ఎగురవేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శాలువలతో సన్మానించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళుతోందని ఎర్రబెల్లి వెల్లడించారు. బంగారు తెలంగాణ తెరాసతోనే సాధ్యపడుతోందన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి కేసీఆర్ తెలంగాణను తీసుకువచ్చారని పేర్కొన్నారు. తెలంగాణ గాంధీ కేసీఆర్ అని మంత్రి కొనియాడారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాఠోడ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

బంగారు తెలంగాణ తెరాసతోనే సాధ్యం: ఎర్రబెల్లి

ఇదీ చూడండి: రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు తెరాసే శ్రీరామ రక్ష: సత్యవతి రాఠోడ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.