వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్లలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన నరిగె బొందమ్మ పీఏసీఎస్ ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రంలో బస్తాల్లో మక్కలు నింపేందుకు వెళ్లింది. మక్కలు నింపుతూనే ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది.
విషయం గమనించిన స్థానికులు వెళ్లి చూసేసరికే ఆమె చనిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వయోభారంతోనే ఆ వృద్ధురాలు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవీ చూడండి: గొర్రెకుంట బావి ఘటనలో వీడిన మిస్టరీ.. ప్రేమ వ్యవహారమే కారణమా?