వరంగల్ గ్రామీణ జిల్లాలో వడగండ్ల వర్షం కడగండ్లు మిగిల్చింది. అకాల వర్షం రైతులను అతలాకుతలం చేసింది. పంటలు నీట మునిగి మామిడి, వరి, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. . భారీ గాలులకు పలు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.
వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పరిధిలో అకాల వర్షానికి వరి, మొక్కజొన్నతో పాటు మిగతా పంటలు నీటిపాలయ్యాయి. సంగెం, పర్వతగిరి, రాయపర్తి మండలాల్లో వడగండ్ల వర్షం రైతులను నట్టేట ముంచింది. చేతికందొచ్చిన పంట అకాల వర్షానికి నేల మట్టమవ్వడం వల్ల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమకు పంటనష్టం అందించాలని వేడుకుంటున్నారు.