వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలంలో నిర్మిస్తున్న టెక్స్‌టైల్ పార్కు వద్ద తెదేపా నాయకులు ఆందోళన చేపట్టారు. శిలాఫలకం వేసి రెండు సంవత్సరాలు పూర్తైనా ఇంతవరకు పార్కు పూర్తి కాలేదని ధర్నాకు దిగారు. రైతుల వద్ద భూములను బలవంతంగా లాక్కొని టెక్స్ టైల్ పార్కు కోసం శిలాఫలకం వేశారని ఆరోపించారు. ఎకరానికి 10 లక్షల పరిహారం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంత వరకు ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదన్నారు. రెండు సంవత్సరాల నుంచి టెక్స్‌టైల్ పార్కు కోసం తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. ఆందోళన చేస్తున్న తెదేపా శ్రేణులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
ఇవీ చూడండి: 'ప్రభుత్వ ఆదేశాల మేరకే.. ప్రైవేటు బస్సులు'