వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో వేసవికాల శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 10 పాఠశాలలకు చెందిన 100 మంది విద్యార్థినులు ఈ నెల 9 నుంచి శిక్షణ పొందుతున్నారు. ఈ నెల 25 వరకు శిబిరం కొనసాగనుంది. కంప్యూటర్ కోర్సులో శిక్షణ పొందడం వల్ల భవిష్యత్లో తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వేసవి సెలవులు వచ్చాయంటే ఎక్కడికి వెళ్ళాలి అనేది చూడకుండా సమయాన్ని వృథా చేసుకోకుండా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దృష్టి సారించడం సంతోషంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు.
గురుకుల పాఠశాలల అధికారులు సైతం శిబిరాన్ని తరచూ పరిశీలించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు.
ఇవీ చూడండి: