ETV Bharat / state

ఆహ్లాదం+ ఆరోగ్యం+ ఆధ్యాత్మికత= ప్రకృతి వనాలు - special story on prakruthi vanalu

హరితహారం స్ఫూర్తితో పల్లెల్లో ప్రకృతి వనాలు రూపుదిద్దుకుంటున్నాయి. సర్పంచ్‌లు ప్రత్యేక దృష్టి పెట్టిన చోట.... అత్యంత సుందరంగా తయారవుతున్నాయి. వరంగల్‌ గ్రామీణ జిల్లాల్లో పలు గ్రామాల్లో పచ్చదనం వెల్లివిరుస్తోంది.

special story on  prakruthi vanalu in warangal rural district
ఆహ్లాదం+ ఆరోగ్యం+ ఆధ్యాత్మికత= ప్రకృతి వనాలు
author img

By

Published : Mar 4, 2021, 1:08 PM IST

ఆహ్లాదం+ ఆరోగ్యం+ ఆధ్యాత్మికత= ప్రకృతి వనాలు

వరంగల్ గ్రామీణ జిల్లా దుగ్గొండి మండలంలోని 46 గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ గుంటి పల్లవి తన ఆలోచనకు పదునుపెట్టి పార్కుల్లో పచ్చదనమే కాకుండా వైవిధ్యంగా ఉండేలా ప్రోత్సహించారు. 13 గ్రామాల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ప్రత్యేకమైన పల్లెప్రకృతివనాలు ఏర్పాటు చేశారు.

రామాయణం ప్రత్యేకత

నాచినపల్లి రామాలయానికి అనుసంధానంగా పచ్చటి పొలాల మధ్యలో ఒక ఎకరం విస్తీర్ణంలో గ్రీన్ రామాయన్ పార్కును ఆరు ఘట్టాలతో ఏర్పాటు చేశారు. సీతారాములు అరణ్యవాసం చేసినప్పుడు ఏ ప్రాంతంలో పర్యటించారు.. ఎక్కడ సేదదీరారు.. వంటి చిత్రాలు వేయించారు. పల్లెలంటేనే వ్యవసాయం, రైతులు అనే భావన కలిగించేలా.... సర్పంచ్ మమత పార్కులో ఎండ్ల బండి పెట్టించి రంగులు వేయించారు. ఈ పార్కు వల్ల ఆహ్లాదంతోపాటు రామాయణం ప్రత్యేకత తెలుస్తోందని గ్రామస్థులు పేర్కొన్నారు.

ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దిన పార్కులు

ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తీర్చిదిద్దిన పార్కులు..... ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. పిల్లిగుండ్లతండాలో బటర్‌ఫ్లై పార్కు, శివాజీనగర్‌లో రాశీనక్షత్రవనం, మల్లంపల్లిలో ఇండియా మ్యాప్, చలపర్తిలో పంచతత్వ పార్కు నిర్మించారు. మైసంపల్లిలో గణేష్ నవరాత్రుల్లో భాగంగా ఉపయోగించే 21 పత్రాలకు సంబంధించిన మొక్కలతో ప్రకృతివనాన్ని తీర్చిదిద్దారు. వెంకటాపురంలో సప్తరుషుల పార్కులు ఏర్పాటు చేశారు. హరిత తెలంగాణ లక్ష్యంలో తమ వంతు కృషి చేస్తున్నామని దుగ్గొండి ఎంపీడీవో పల్లవి పేర్కొన్నారు.

ఆహ్లాదం, ఆరోగ్యం

అందంగా ముస్తాబు చేసిన పార్కులు... ఆహ్లాదం పంచడంతోపాటు ఆరోగ్యం పెంపొందించుకోవడానికి సహకరిస్తున్నాయని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.