ETV Bharat / state

కిరాతకుడు: ఒక హత్యను కప్పిపుచ్చేందుకు మరో 9 హత్యలు

నిద్రమాత్రలివ్వడం... మత్తులోకి జారుకున్నాక దారుణంగా చంపేయడం.. ఇది ఆ రాక్షసుడి నైజం. ముందుగా... ఓ మహిళను చేరదీశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి... సహజీవనం చేశాడు. ఆమె కుమార్తెపైనా కన్నేశాడు. ఫలించకపోవడం వల్ల... చున్నీతో గొంతు బిగించి చంపి రైలునుంచి తోసేశాడు. ఇది కప్పి పుచ్చుకునేందుకు... ఈసారి నరరూపరాక్షసుడిలా మారాడు. 9 మందిని నిర్దాక్షిణ్యంగా బావిలోకి నెట్టి చంపేశాడు. ఎందరి కళ్లు కప్పినా ఎంత ఘోరం చేసినా.. నిఘా నేత్రానికి దొరికిపోయాడు. పోలీసులకు చిక్కి ఊచలు లెక్కపెట్టేందుకు సిద్ధమయ్యాడు.

కిరాతకుడు: ఒక హత్యను కప్పిపుచ్చేందుకు మరో 9 హత్యలు
కిరాతకుడు: ఒక హత్యను కప్పిపుచ్చేందుకు మరో 9 హత్యలు
author img

By

Published : May 25, 2020, 9:02 PM IST

Updated : May 25, 2020, 9:22 PM IST

కిరాతకుడు: ఒక హత్యను కప్పిపుచ్చేందుకు మరో 9 హత్యలు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్​ గ్రామీణ జిల్లా గొర్రెకుంట హత్యల మిస్టరీని 72 గంటల్లోనే ఛేదించిన వరంగల్ పోలీసులు సోమవారం ఆ రాక్షసుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. నాలుగు సెల్ ఫోన్లు, మూడు వందల నగదు, ఉపయోగించిన సైకిల్, వాల్ మార్ట్ నుంచి తెచ్చుకున్న సామగ్రిని నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. మార్చిలో చేసిన హత్యను కప్పిపుచ్చుకునేందుకు.. మరో 9 హత్యలు చేశాడు సంజయ్​ కుమార్​ యాదవ్​.

సాన్నిహిత్యమే కారణం

ఐదేళ్ల క్రితం మక్సూద్‌ భార్య నిషా ఆలమ్​ సోదరి కుమార్తె రఫిక బంగాల్‌ నుంచి వరంగల్‌కు ఉపాధి కోసం వచ్చింది. సంజయ్‌ కుమార్ ఒంటరిగా జీవనం సాగించేవాడు. సంజయ్‌కుమార్‌కు డబ్బులు తీసుకుని రఫిక భోజనం ఏర్పాటు చేసేది. భర్తతో విడిపోయి ముగ్గురు పిల్లలతో ఉన్న రఫిక, సంజయ్‌కుమార్‌ మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. రఫిక కుమార్తెతో కూడా సంజయ్‌కుమార్ సన్నిహితంగా ఉండేవాడు. ఇదే విషయంపై రఫిక నిలదీసింది. సంజయ్‌కుమార్‌తో పలుమార్లు గొడవపడేది. ఆమెను వివాహం చేసుకుంటానని సంజయ్‌ నమ్మించాడు. ఆ తర్వాత కూడా రఫిక కుమార్తెతో సన్నిహితంగా ఉన్నాడు. సంజయ్‌ ప్రవర్తనలో మార్పు రాకపోవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రఫిక బెదిరించింది.

అడ్డు తొలగించుకునేందుకే

వివాదం ముదరక ముందే రఫికను అడ్డుతొలగించుకోవాలని సంజయ్‌ నిర్ణయించుకున్నాడు. పెళ్లి విషయాన్ని బంధువులతో చర్చించేందుకు బంగాల్‌ వెళ్దామని నమ్మించాడు. మార్చి 6న గరీబ్‌ రథ్‌ రైలులో రాత్రి 10 గంటలకు రఫికను తీసుకుని బయలుదేరాడు. రైలులోనే రఫికకు నిద్రమాత్రలు కలిపిన మజ్జిగ అందించాడు. మత్తులోకి జారుకోగానే ఆమె చున్నీతో గొంతు బిగించి చంపాడు. ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు వద్ద రైలు నుంచి తోసేశాడు. అనంతరం ఏం తెలియనివాడిలా రాజమహేంద్రవరంలో దిగి.. మరో రైలులో వరంగల్​ చేరుకున్నాడు.

నిలదీసిన నిషా ఆలమ్​ను కూడా..

బంగాల్‌లోని తమ బంధువుల ఇంటికి వెళ్లిందని మృతురాలి పిల్లలను నమ్మించాడు. రఫిక బంధువుల ఇంటికి రాలేదని తెలిసిన తర్వాత మక్సూద్‌ భార్య నిషా ఆలమ్‌ సంజయ్‌ను నిలదీసింది. పోలీసులకు సమాచారం ఇస్తానని బెదిరించింది. నిషా ఆలమ్‌ను కూడా చంపాలని సంజయ్‌ నిర్ణయించుకున్నాడు. రఫిక మాదిరిగానే మజ్జిగలో నిద్రమాత్రలు కలిపి నిషా ఆలమ్‌ను చంపాలనుకున్నాడు. మే 16-20 వరకు మక్సూద్‌ కుటుంబం పనిచేస్తున్న పరిశ్రమ చుట్టూ తిరిగాడు.

నిద్రమాత్రలే ఆయుధంగా చేసుకొని..

మే 20న మక్సూద్‌ పెద్దకుమారుడు షాబాజ్‌ ఆలమ్‌ పుట్టినరోజని తెలుసుకున్నాడు సంజయ్​. అదే రోజు నిషా ఆలమ్‌ను చంపాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం మే 18న మెడికల్‌ షాపులో 60 నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు. మే 20న రాత్రి మక్సూద్‌ కుటుంబంతో చాలాసేపు ముచ్చటించాడు. వారి కుటుంబం తయారు చేసిన భోజనంలో నిద్రమాత్రలు కలిపాడు. అదే ఇంట్లో పైభాగంలో ఉంటున్న బిహార్​కు చెందిన శ్యామ్‌, శ్రీరామ్​ల భోజనంలోనూ నిద్రమాత్రలు కలిపాడు. అందరూ నిద్రలోకి జారుకోగానే సాక్ష్యం దొరక్కుండా అందరినీ బావిలోకి తోసేశాడు.

ఒక్కొక్కరిగా బావిలో పడేసి..

ఈ నెల 20 అర్ధరాత్రి 12.30 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకూ సంజయ్ ఒక్కొక్కరినీ తీసుకొచ్చి బావిలో పడేశాడు. మూడేళ్ల బాబును చూసైనా సంజయ్ మనసు కరగలేదు. నిర్ధాక్షణ్యంగా బావిలో ఎత్తి పడేశాడు. అందరూ చనిపోయారనుకుని నిర్ధరించుకున్నాక... మక్సూద్​ ఇంట్లోకి వెళ్లాడు సంజయ్​. సామగ్రి, సెల్​ఫోన్లు తీసుకొని తాపీగా ఇంటికి చేరుకున్నాడు.

ఇలా దొరికాడు..

ఈ కేసు దర్యాప్తునకు వరంగల్​ సీపీ రవీందర్​ 6 బృందాలు ఏర్పాటు చేశారు. గోదాము, గొర్రెకుంట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, కాల్​ డేటా ఆధారంగా నిందితుడిని గుర్తించారు. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు జాన్‌పాక్‌లోని తన ఇంట్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సీపీ తెలిపారు.

విచారణలో తాను చేసిన అన్ని నేరాలను సంజయ్​ అంగీకరించినట్లు సీపీ పేర్కొన్నారు. ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు మిగతా వాళ్లను చంపినట్లు సీపీ స్పష్టం చేశారు. ఈనెల 21న బావిలో నుంచి 4 మృతదేహాలు వెలికితీశామని... 22న బావిలో నుంచి మరో 5 మృతదేహాలు వెలికితీసినట్లు తెలిపారు. పదిమందిని బలితీసుకున్న సంజయ్​ను పట్టుకునేందుకు కృషి చేసిన పోలీసులను కమిషనర్​ అభినందించారు.

ఇదీ చూడండి: మరో 3 రోజులు తప్పని భానుడి భగభగలు

Last Updated : May 25, 2020, 9:22 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.