మహబూబాబాద్, వరంగల్ రూరల్ జిల్లాల్లో శనివారం సాయంత్రం భారీగా వడగళ్ల వాన పడింది. కోత దశకు వచ్చిన వరి నేల వాలింది. మిర్చి, మొక్కజొన్న మిరప పంటలకూ నష్టం వాటిల్లింది. వడగండ్లకు పుచ్చకాయలు సైతం పగిలిపోయాయి.
ఈ రెండు జిల్లాల్లో దాదాపు వెయ్యి ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా. కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన వందల క్వింటాళ్ల మక్కలు కూడా తడిసిపోయాయని రైతులు వాపోతున్నారు.
ఇదీ చూడండి : ఔషధాల లేమి... పొంచి ఉన్న ప్రమాదం