ETV Bharat / state

బంగారు తెలంగాణ చేస్తానని ... అప్పుల తెలంగాణగా మార్చారు : షర్మిల - sharmila guarantes

sharmila comments on cm kcr: తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైస్ షర్మిల ఆరోపించారు. ఇప్పటి వరకు ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని, పంటలు దెబ్బతింటే పరిహారం అందించలేదని... ప్రజాప్రస్థానం పాదయాత్రలో కేసీఆర్ పై షర్మిల విమర్శలు చేశారు. తన పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ వైఎస్ఆర్ పాలన అందిస్తామన్నారు.

sharmila
sharmila
author img

By

Published : Nov 22, 2022, 1:40 PM IST

sharmila comments on cm kcr: తెరాసకు అధికారం ఇస్తే బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైస్ షర్మిల ఆరోపించారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం రూపిరెడ్డిపల్లిలో మొదలై లింగాల, రంయ్యపల్లి మీదుగా సాయంత్రం మడ్డపల్లికి చేరుకున్నారు. ఆయా గ్రామాల్లోని ప్రజలకు అభివాదం చేస్తూ పార్టీ జెండాలను ఆవిష్కరిస్తూ ముందుకు సాగారు. కార్యకర్తలు, మహిళలు ఆమెకు పూలమాలలు వేసి స్వాగతం పలికారు.

అధికార పార్టీపై విమర్శలు : ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ..' ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి కనీసం ఊరికో ఉద్యోగం ఇవ్వలేదు. దళిత బంధు పేరుతో దగ్గరి అనుచరులకు దోచి పెడుతున్నారని' అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏదో ఒక కొత్త పథకం తీసుకురావటం కేసీఆర్ కు అలవాటుగా మారిందని విమర్శించారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ కాదుకదా.. తాగుబోతుల తెలంగాణ మార్చిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని మండిపడ్డారు. గడిచిన ఎనిమిదేళ్లలో అకాల వర్షాలతో పంటలు దెబ్బతింటే ప్రభుత్వం మాత్రం పంటలను పరిశీలించలేదని, పరిహారం చెల్లించిన దాఖలాలు లేవని ఆరోపించారు.. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఉద్యోగాల భర్తీపై పెడతామని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి :

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. ఆ ముగ్గురిపై లుక్​అవుట్ సర్క్యులర్ జారీ

చెట్ల కొట్టివేతను తక్షణమే ఆపండి: ఏపీ హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.