ETV Bharat / state

వర్షాకాలంలో తాగునీటికి కష్టాలు.. బిందెలతో రోడ్డెక్కిన మహిళలు - తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

వేసవి రాకముందే ఆ మహిళలకు నీటికష్టాలు మొదలయ్యాయి. తాగేందుకు నీరులేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో మూడునెలలుగా మంచినీరు రావడం లేదని బాధితులు బిందలతో రోడ్డెక్కారు.

వర్షాకాలంలో తాగునీటికి కటకట.. రోడ్డెక్కిన మహిళలు

author img

By

Published : Sep 19, 2020, 10:06 AM IST

వరంగల్ గ్రామీణ జిల్లా వర్థన్నపేట మండలం ఇల్లందలో మహిళలు తాగునీటి కోసం ఆందోళన బాట పట్టారు. ఖాళీ బిందెలతో వరంగల్- ఖమ్మం రహదారిపై బైఠాయించి రెండు గంటలపైగా నిరసనకు దిగారు. ఫలితంగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మహిళలతో మాట్లాడి నిరసనను విరమింపజేశారు.

వర్షాకాలంలో తాగునీటికి కటకట.. రోడ్డెక్కిన మహిళలు
వర్షాకాలంలో తాగునీటికి కటకట.. రోడ్డెక్కిన మహిళలు

ఎవరూ పట్టించుకోవట్లేదు..

మూడు నెలలుగా నీటికష్టాలు ఎదుర్కొంటున్నామని.. తమ సమస్యలను ఎవరూ తీర్చడంలేదని పోలీసులతో మొరపెట్టుకున్నారు. స్పందించిన పోలీసులు సంబంధిత అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్తామని స్పష్టం చేసినట్లు బాధితులు పేర్కొన్నారు.

ఇవీ చూడండి : రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు... మత్తడిపోస్తున్న చెరువులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.