వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దామెర మండలం సింగరాజుపల్లికి చెందిన ఒడ్డెపల్లి పెద్దమల్లయ్య అస్థికలు కాళేశ్వరంలో కలిపి స్వస్థలానికి బయలుదేరగా మార్గం మధ్యలో ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనం ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. అందులోని దాదాపు 20 మంది గాయాలపాలయ్యారు. తీవ్రంగా గాయపడ్డ ఒడ్డెపల్లి నాగలక్ష్మిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
మిగిలిన వారిలో కొందరికి తలకు, కాళ్ళకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పరకాలలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మరో 15 మంది స్వల్పంగా గాయపడ్డారు.