ETV Bharat / state

ఇళ్లు ఖాళీ చేయాలంటూ రెవెన్యూ అధికారుల నోటీసులు - వరంగల్ గ్రామీణ జిల్లా తాజా సమాచారం

ప్రభుత్వం కేటాయించకముందే ఆక్రమించుకున్నారంటూ రెండు పడక గదుల ఇళ్లను ఖాళీ చేయాలంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లోగా వాటిని ఖాళీ చేసి సంబంధిత అధికారులకు అప్పగించాలని హెచ్చరించారు.

revenue-officers-notices to leave double bed rooms in warangal rural district
ఇళ్లు ఖాళీ చేయాలంటూ రెవెన్యూ అధికారుల నోటీసులు
author img

By

Published : Oct 12, 2020, 5:13 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను వెంటనే ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వం కేటాయించకుండానే వాటిలో నివాసం ఉంటున్న 50 కుటుంబాలకు మూడు రోజుల గడువు ఇచ్చారు.

ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను ఎలాంటి అనుమతులు లేకుండా ఆక్రమించుకోవడం నేరమని అధికారులు తెలిపారు. ఈ నెల 15 వ తేదీ లోగా ఖాళీ చేసి సంబంధించిన అధికారులకు అప్పగించాలని డెడ్‌లైన్‌ విధించారు. లేని పక్షంలో లబ్ధిదారులను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: తెరాస నేతల తీరుకు వ్యతిరేకంగా ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.