Railway officials rescue the child labourers: పేదరికమే వారిట శాపంగా మారింది. ఆడుకునే వయస్సులోనే వారిని కష్టాల బాట పట్టిస్తుంది. చదువుతో పాటు స్వస్థలాల నుంచి, తల్లిదండ్రులకు దూరం చేస్తుంది. హాయిగా గడపాల్సిన బాల్యంలో రేయింబవళ్లు కార్కానాల్లో కూలీలుగా చేస్తున్నారు. బిహార్‌కు చెందిన 13 నుంచి 18 వయస్సులోపు ఉన్న కుర్రాళ్లను హైదరాబాద్‌లోని వివిధ పరిశ్రమల్లో పని చేయించడం కోసం అక్రమంగా తరలిస్తున్న 34 మంది బాల కార్మికులను కాజీపేట రైల్వే పోలీసులు గత రాత్రి దర్భంగా రైలులో పట్టుకున్నారు.
నెల క్రితమే బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన చిన్న పిల్లల్ని హైదరాబాద్‌కు పనుల కోసం తరలిస్తున్నట్లు సమచారం తెలియడంతో రైల్వే పోలీసులు, మహిళా శిశు సంక్షేమ అధికారులు, బచ్‌పన్ బచావో ఆందోళన్ స్వచ్ఛంద సంస్థ వారు అప్రమత్తమయ్యారు. చిన్నపిల్లల్ని, అక్రమ రవాణ చేసేవారిని పట్టుకోడానికి ముందస్తుగా యాక్షన్ ప్లాన్ చేశారు.
పక్కా సమచారంతో చేధించిన పోలీసులు: ఇవాళ ఉదయం వరంగల్ రైల్వే స్టేషన్లో తనిఖీలు జరిపారు. రైల్వే పోలీసులతో పాటు ఇతర సంస్థల అధికారులు ప్రణాళిక ప్రకారం సిరిపూర్ ఖాగజ్ నగర్ వెళ్లి అక్కడ రైళ్లో వచ్చిన పిల్లల్ని గమనించారు. ఎంత మంది బాల కార్మికుల కిందకి వస్తారు... వాళ్లు ఎక్కడి నుంచి వచ్చారు. ఏఏ ప్రాంతాలకు వెళ్లనున్నారు అనే అంశాలను గమనించినట్లు అధికారులు తెలిపారు. యూపీ, ఒడిశా నుంచి వివిధ రైళ్లలో వస్తున్న మరో 30 మంది బాలకార్మికులను రైల్వే అధికారులు పట్టుకున్నారు. వీరందరినీ స్థానిక బాలల సంరక్షణ కేంద్రానికి తరలించి, చిరునామాలు తెలుసుకొని స్వస్థలాలకు పంపిస్తామని బాలల సంరక్షణా విభాగం అధికారులు తెలిపారు.
"సిర్పూర్ ఖాగజ్ నగర్ నుంచి రావడం జరిగింది. బాలల సంరక్షణ అధికారులు వారిని సిర్పూర్ ఖాగజ్ నగర్ రైళ్లో పట్టుకోవడం జరిగింది. పై అధికారుల సూచనల మేరకు వారి వివరాలు తీసుకొని స్వస్థలాలకు పంపిస్తాము".- అధికారిని మహిళా శిశు సంక్షేమ శాఖ
"వాళ్లు ఉన్న పరిస్థితులను చూస్తే వారు పని చేయడానికే వచ్చారని పక్కాగా తెలుస్తుంది. కొందరు భవన నిర్మాణంలో తెలిసిన వారు ఉన్నారు అక్కడికి వెళ్తున్నామని, కొందరు చిన్న కంపెనీలో పని చేయడానికి వెళ్తున్నామని తెలిపారు. బిహార్ నుంచే 28 మంది ఉన్నారు. వారందరి వివరాలు తీసుకొని వారి సొంత ప్రాంతాలకు పంపుతాము".- అధికారి
ఇవీ చదవండి: