రోడ్డు ప్రమాదంలో మరణించిన భార్యా భర్తల మృతికి కారకుడైన వాహనదారుడి నివాసం ముందు గ్రామస్తులు, బంధువులు నిరసనకు దిగారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట మండలం దాసరిపల్లి గ్రామానికి చెందిన అనంతగిరి లత, శ్రీనివాస్ దంపతులు వరంగల్‌కు ప్రతీ రోజు ద్విచక్రవాహనంపై కూలీ పనికి వెళ్లి వస్తుంటారు.
ఈ క్రమంలో ఇంటికి వస్తుండగా నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామానికి చెందిన ఓ టవేరా వాహనం ఢీకొట్టడం వల్ల గీసుకొండ మండలం ధర్మారం సమీపంలో ఇరువురు దుర్మరణం చెందారు. మృతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. వారికి న్యాయం చేయాలని... నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని బంధువులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. మృత దేహాలను వాహనదారుడి ఇంటి ముందు టెంట్ వేసి ఆందోళన చేపట్టారు. పోలీసులు కలగచేసుకుని బాధిత కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా చూస్తామని చెప్పగా నిరసన విరమించారు.
ఇవీ చూడండి : బైక్‌ను ఢీ కొట్టిన కారు... ఒకరు మృతి