వరంగల్ గ్రామీణం జిల్లా పెద్ద రాజీపేటలో పోచమ్మ గుడి పరిసరాల్లో పరకాల పోలీసులు హరితహారం నిర్వహించారు. ఎస్సైలు రవి కిరణ్, శ్రీకాంత్ రెడ్డి, కానిస్టేబుల్ దేవేందర్ తదితరులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు కూడా పాల్గొన్నారు. నాటిన మొక్కలను కాపాడే బాధ్యత తీసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి.. వాటిని సంరంక్షించడం ఒక దినచర్యగా చేసుకోవాలన్నారు. భావితరాలకు మంచి వాతావరణాన్ని ఇవ్వడానికి అందరూ హరితహారంలో స్వచ్ఛందంగా పాల్గొనాలన్నారు.
ఇవీ చూడండి: మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన సీఎం కేసీఆర్