వరంగల్ రూరల్ జిల్లా పరకాల పురపాలికలో పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. 22 స్థానాల్లో 11 ఏకగ్రీవం కాగా మిగిలిన 11 వార్డుల్లో 22 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. పోలీసులు 9 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ప్రజలు ప్రశాంతంగా ఓటేసుకునేందుకు అన్ని సౌకర్యాలు చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఓటర్లకు ఓటింగ్‌పై సందేహాలు తీర్చేందుకు ప్రతి పోలింగ్ కేంద్రం బయట అధికారులు హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:'తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది'