వరంగల్ రూరల్ జిల్లా పరకాల ప్రజల సౌకర్యార్థం పోలీసులు అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. కరోనా బాధితులను ఆస్పత్రులకు తరలించడానికి ఈ సేవలు ఉపయోగించుకోవాలని డీసీపీ వెంకటలక్ష్మి తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఈ వాహనాన్ని వరంగల్ కమిషనరేట్ ఈస్ట్ జోన్ డీసీపీ వెంకట లక్ష్మి ప్రారంభించారు.
లాక్డౌన్లో ఆస్పత్రులకు వెళ్లడానికి ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకే అంబులెన్సు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సేవల కోసం 9347528516 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో పరకాల ఏసీపీ పి. శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ పి.మహేందర్, సీఐ రమేష్ కుమార్, ఆత్మకూర్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్, ఎస్సైలు, సిబ్బంది, పరకాల సీహెచ్‌సీ సూపరింటెండెంట్ సంజీవ్, సోద రామకృష్ణ, శాఖమూరి అమర్ తదితరులు హాజరయ్యారు.
ఇదీ చదవండి: ఔషధాలతో నిలిపి ఉంచిన డీసీఎం దగ్ధం..