వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్నిస్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్ సందర్శించారు. కొవిడ్ కేర్ సెంటర్లో ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఐసోలేషన్లో ఉండే కరోనా బాధితులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కరోనా సోకిన ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.